హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి ప్రమాణం

ప్రధానాంశాలు

హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి ప్రమాణం

పలువురి అభినందనలు

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం దసరా పర్వదినాన ప్రమాణ స్వీకారం చేశారు. పెరుగు శ్రీ సుధ, డాక్టర్‌ చిల్లకూర్‌ సుమలత, డాక్టర్‌ గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్‌, నూన్‌సావత్‌ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వరరెడ్డి, పట్లోళ్ల మాధవి దేవిలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ప్రమాణం చేయించారు. అంతకుముందు రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుపమా చక్రవర్తి ఒక్కొక్కరి నియామక పత్రాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులతోపాటు అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి, సహాయ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సి.ప్రతాప్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు, న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులకు బంధువులు, మిత్రులు, న్యాయమూర్తులు అభినందనలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని