సీజే సహా నూతన న్యాయమూర్తులకు బార్‌ అసోసియేషన్‌ సన్మానం

ప్రధానాంశాలు

సీజే సహా నూతన న్యాయమూర్తులకు బార్‌ అసోసియేషన్‌ సన్మానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతోపాటు నూతనంగా నియమితులైన న్యాయమూర్తులను హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సోమవారం ఘనంగా సన్మానించింది. వేర్వేరు సమయాల్లో అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌ గౌడ్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో  అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ ముంతాజ్‌ పాషా, కార్యదర్శులు సి.కళ్యాణ్‌రావు, టి.సృజన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


22న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం

ముంబయి హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేస్తారని రిజిస్ట్రార్‌ జనరల్‌ జి.అనుపమా చక్రవర్తి తెలిపారు. ఇక్కడి నుంచి త్రిపుర హైకోర్టుకు బదిలీపై వెళుతున్న జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు 21న హైకోర్టు వీడ్కోలు పలకనుందని, మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని