ఇది అభిమానుల ప్రతిస్పందన

ప్రధానాంశాలు

ఇది అభిమానుల ప్రతిస్పందన

తిట్లు వినలేనివారి స్పందన రాష్ట్రమంతటా కనిపించింది: ఏపీ సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: టీవీల్లో వచ్చే తిట్లు, అసభ్యపదజాలం వినలేక మనల్ని అభిమానించేవాళ్లు, ప్రేమించేవాళ్లు చూపించిన ప్రతిస్పందన రాష్ట్రమంతా కనిపించిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఏ రోజు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు.. అంతటి దారుణమైన బూతులు వీళ్లే తిడతారు.. కావాలని తిట్టించి, వైషమ్యాలు సృష్టించి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆరాటం కనిపిస్తోందని విమర్శించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం ‘జగనన్న తోడు’ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి, జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రజలు ప్రేమ, ఆప్యాయతలు చూపుతుంటే ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అసత్యాలు ప్రచారం చేస్తారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికీ వెనుకాడరు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడతారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్‌ చేస్తున్న పరిస్థితులు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని