నన్నూ, నా తల్లినీ తిడుతున్నారు..

ప్రధానాంశాలు

నన్నూ, నా తల్లినీ తిడుతున్నారు..

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు: ఏపీ సీఎం జగన్‌

ఈనాడు - అమరావతి: రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా పరుష పదజాలంతో దూషిస్తున్నారని.. తనను, తన తల్లిని ఉద్దేశించి తిడుతున్నారని.. ఇలాంటివి ఇప్పుడే చూస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఇలాంటి పనులు చేయడం సరైందేనా? దీని వల్ల రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని ఆరాటపడటం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులుగా రూపుమార్చుకుంటున్న అసాంఘిక శక్తులను మనం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇటువంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  రాష్ట్రం పరువు ప్రతిష్ఠలు దిగజార్చేలా డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ మాట్లాడుతున్నారని, రోజూ అబద్ధాలు చెబుతూ మన రాష్ట్రం, మన పిల్లలకు కళంకాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు. పట్టుబడిన మాదకద్రవ్యాలతో మన రాష్ట్రానికి సంబంధం లేదని సాక్షాత్తు డీఆర్‌ఐ, విజయవాడ సీపీ వివరణ ఇచ్చినా, డీజీపీ పదే పదే చెప్పినా.. నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని