వంట నూనెల నిల్వలపై పరిమితులు విధించండి

ప్రధానాంశాలు

వంట నూనెల నిల్వలపై పరిమితులు విధించండి

గరిష్ఠంగా 2 నెలలకే పరిమితం చేయాలి

రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ఈనాడు, దిల్లీ: పండుగల సీజన్‌లో వంట నూనెల వినియోగం పెరగనున్నందున, వ్యాపారులు కృత్రిమ డిమాండ్‌ సృష్టించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ శుక్రవారం రాష్ట్రాలకు లేఖలు రాసింది. గతంలో నిల్వలపై విధించిన పరిమితులను దృష్టిలో ఉంచుకొని వంట నూనెలు, నూనె గింజల స్టాక్‌పై ఆంక్షలు విధించాలని సూచించింది. రిఫైనర్లు, మిల్లర్లు, టోకు వర్తకులు రెండు నెలలకు మించి సరకు నిల్వ చేయకుండా చర్యలు తీసుకోవాలని; ఈ 2 నెలల నిల్వల మొత్తం... వారు గత ఆరు నెలలుగా నిల్వచేసిన సగటుకు మించకూడదని పేర్కొంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకూ తీసుకున్న చర్యల గురించి ఈనెల 25న జరిగే సమావేశంలో నివేదించాలని సూచించింది. వివిధ రాష్ట్రాల్లో గతంలో నిల్వలపై విధించిన పరిమితుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ఈ లేఖతో జతచేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని