ఎన్నికల తర్వాతే కశ్మీర్‌కు రాష్ట్ర హోదా

ప్రధానాంశాలు

ఎన్నికల తర్వాతే కశ్మీర్‌కు రాష్ట్ర హోదా

నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుంది: అమిత్‌ షా

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలకు, అభివృద్ధికి విఘాతం కల్గించే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. ఈ ప్రాంత అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని, అది పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర హోదా కల్పిస్తామని తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం శనివారం ఆయన శ్రీనగర్‌కు చేరుకున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆయన కశ్మీర్‌కు రావడం ఇదే మొదటిసారి. శ్రీనగర్‌ చేరుకున్న వెంటనే ...జూన్‌ 22న ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్వైజ్‌ అహ్మద్‌ ఇంటికి అమిత్‌ షా వెళ్లారు. అహ్మద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు. అనంతరం జమ్మూ-కశ్మీర్‌లో భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని