Petrol: పెట్రోల్‌, డీజిల్‌ కంటే.. విమాన ఇంధనమే చౌక!

ప్రధానాంశాలు

Petrol: పెట్రోల్‌, డీజిల్‌ కంటే.. విమాన ఇంధనమే చౌక!

తెలుగు రాష్ట్రాల్లో రూ.100 దాటిన పెట్రోల్‌, డీజిల్‌
ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ లీటరు గరిష్ఠంగా రూ.83
ఈనాడు, వాణిజ్య విభాగం

పెట్రోల్‌, డీజిల్‌ కంటే విమాన ఇంధనమే చౌకా! ఇది నిజమా! అని ఆశ్చర్యపోకండి. ఔను ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఇదే. విమాన రాకపోకలకు వినియోగించే ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) లీటరు ధర కంటే లీటరు  పెట్రోలు/డీజిల్‌ ధరే కనీసం రూ.20 కంటే అధికంగా ఉంది. కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో స్థిరంగా ఉంచిన చమురు విక్రయ సంస్థలు, 14 నుంచి మళ్లీ పెంచుతూపోతున్నాయి. వరుసగా నాలుగో రోజైన ఆదివారమూ పెంచాయి. దేశంలో లీటరు పెట్రోల్‌ ధర ఎప్పుడో రూ.100 దాటగా, డీజిల్‌ ధర కూడా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.100 కంటే అధికంగా ఉంది. ఇదే సమయంలో ఏటీఎఫ్‌ కిలో లీటరు(1000 లీటర్ల) ధర గరిష్ఠంగా రూ.83,000 కావడం గమనార్హం. అంటే లీటరు ధర రూ.83 మాత్రమేనన్నమాట.

దీన్నిబట్టి విమాన ఇంధనంతో పోలిస్తే.. సామాన్యులు వాడే పెట్రోలు, డీజిల్‌ ధరలు 30-33 శాతం అధికంగా ఉన్నట్టు లెక్క. అయినప్పటికీ కొవిడ్‌ ముందునాటి కంటే పెట్రో వినియోగం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. పెట్రోలు వినియోగం అప్పటికంటే 10-15 శాతం, డీజిల్‌ వినియోగం 6-10 శాతం వరకు అధికమైందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఇటీవల వెల్లడించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని