Driving School: మహిళల కోసం డ్రైవింగ్‌ స్కూల్‌

ప్రధానాంశాలు

Driving School: మహిళల కోసం డ్రైవింగ్‌ స్కూల్‌

ఈనాడు, హైదరాబాద్‌: మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్త్రీల కోసం ప్రత్యేకంగా మోటారు వాహన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్‌ తెలిపారు. ఈ కేంద్రంలో మహిళలకు రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల శిక్షణతో పాటు జీవనోపాధి మార్గాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లకూ ఈ కేంద్రంలో డ్రైవింగ్‌ శిక్షణ ఇప్పిస్తామన్నారు. సోమవారమిక్కడ వారి జీవనోపాధికి బ్యాగుల తయారీలో 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.   నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మెరుగైన జీవనోపాధి పొందాలని సూచించారు.  ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, ఉచిత వైద్య సదుపాయాలు అందించాలని సామాజిక కార్యకర్త ముకుందమాల కోరారు. అర్హులందరికీ ఇంటి వసతి కల్పించాలని మోంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి వర్గీస్‌, ట్రాన్స్‌ ఈక్వాలిటీ సొసైటీ ప్రతినిధి జాస్మిన్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభావన సంస్థ ప్రతినిధి దీప, శిశుసంక్షేమశాఖ అదనపు సంచాలకులు కేఆర్‌ఎస్‌ లక్ష్మీదేవి, మహిళా కార్పొరేషన్‌ ఏజీఎం సబిత పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని