TS News: ‘దళిత బంధు’ దరఖాస్తుకు ప్రత్యేక యాప్‌

ప్రధానాంశాలు

TS News: ‘దళిత బంధు’ దరఖాస్తుకు ప్రత్యేక యాప్‌

ఆగస్టు తొలివారంలో అందుబాటులోకి..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సంస్థకు బాధ్యతలు అప్పగించింది. వెబ్‌పోర్టల్‌తోపాటు యాప్‌ను ఈ నెలాఖరులోగా సిద్ధంచేసి ఆగస్టు తొలి వారానికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సీజీజీకి సూచించింది. ఈ పథకం కింద నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల కోసం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారిని తొలి ప్రాధాన్యం కింద గుర్తించాలని, ఆ తర్వాత కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 26న దళిత బంధు అవగాహన కార్యక్రమంలో ఈ మేరకు విధివిధానాలు వెలువడే అవకాశముంది. సాంఘిక సంక్షేమ శాఖలో వివిధ పథకాల అమలుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.250 కోట్లు జమయ్యాయి. ఈ నిధులను దళిత బంధు కోసం ఖర్చుచేసే అవకాశమున్నట్లు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని