prashant kishor: ప్రియాంకను చూస్తే రాహుల్‌కు భయం: పీకే

ప్రధానాంశాలు

prashant kishor: ప్రియాంకను చూస్తే రాహుల్‌కు భయం: పీకే

దిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మరో వివాదానికి తెరతీశారు. సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శక్తి సామర్థ్యాలను చూసి ఆమె సోదరుడు రాహుల్‌ గాంధీ భయపడుతున్నారని చెప్పారు. 2017 ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అచ్చం తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీలా ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలున్నాయని అన్నారు. రాహుల్‌ను తొలిసారి పట్నాలో కలిశానని, అప్పుడే తనను కాంగ్రెస్‌ కోసం పనిచేయమని అడిగినట్లు చెప్పారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని