close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భాజపాకు ఓటెందుకు వేయాలి?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు ధ్వజం

చేర్యాల, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి ఓటెందుకు వేయాలో ఆ పార్టీ నాయకులు చెప్పాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా సోమవారం చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూల్మిట్ట మండలాల పట్టభద్రులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘‘ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందుకా? రూ.900 కోట్ల బీఆర్‌జీఎఫ్‌ నిధులు ఇవ్వనందుకా? గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయనందుకా? బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీని స్థాపించనందుకా? వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టనందుకా? గ్యాస్‌, పెట్రో ధరలు పెంచుతున్నందుకా? త్వరలో ఎరువుల ధరలు పెంచనున్నందుకా? ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. ఓట్ల కోసం వచ్చే భాజపా నాయకులను ఈ  విషయాలన్నింటిపైనా నిలదీయాలి’’ అని మంత్రి పట్టభద్రులకు సూచించారు. పల్లా గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేశారు. తెరాస పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో నమూనాగా నిలిచిందన్నారు. సమావేశంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు