‘బీసీ కులాల గణన చేపట్టకుంటే పార్లమెంట్‌ ముట్టడి’

ప్రధానాంశాలు

‘బీసీ కులాల గణన చేపట్టకుంటే పార్లమెంట్‌ ముట్టడి’

ఈనాడు, దిల్లీ: రానున్న జనగణనలో కులాలవారీగా లెక్కించాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, కేశన శంకర్‌రావు డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర కులాల గణన చేపట్టబోమని ఇటీవల పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ చేసిన ప్రకటనపై దిల్లీలోని జంతర్‌మంతర్‌లో శనివారం సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కులాల గణన చేపట్టకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో స్పందించని పార్టీల నేతల పర్యటనలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన సంఘం నాయకులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని