కల్లుగీత కార్మికుల సమస్యలపై తెదేపా పోరాటం: బక్కని

ప్రధానాంశాలు

కల్లుగీత కార్మికుల సమస్యలపై తెదేపా పోరాటం: బక్కని

ఈనాడు, హైదరాబాద్‌: కల్లుగీత కార్మికుల సమస్యలపై తెదేపా పోరాడుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు చెప్పారు. శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా కల్లుగీత కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్ల క్రితం తొలి విడతలో డీడీలు కట్టిన గొల్ల, కురుమలకు ఇంతవరకూ గొర్రెలు పంపిణీ చేయలేదని, వారికి రెండో విడతలో పెంచిన ధరల ప్రకారం నగదు బదిలీ చేయాలని కోరుతూ సీఎంకు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ లేఖ రాశారు. రాబోయే బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్రంలో తయారైన చీరలనే పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని