నేనే ముఖ్యమంత్రినని ఎవరూ చెప్పలేదే: ప్రహ్లాద్‌ జోషి

ప్రధానాంశాలు

నేనే ముఖ్యమంత్రినని ఎవరూ చెప్పలేదే: ప్రహ్లాద్‌ జోషి

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: యడియూరప్ప తర్వాత కర్ణాటకకు ముఖ్యమంత్రి తానేనని అధిష్ఠానం ఏమీ చెప్పలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం హుబ్బళ్లిలో విలేకర్లతో మాట్లాడుతూ ‘ఈ విషయంపై నాతో ఎవరూ చర్చించలేదు. యడియూరప్ప రాజీనామా చేస్తారో లేదో కూడా అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. అవగాహన లేని అంశాలపై నేనెలా స్పందించగలను?’ అంటూ ప్రశ్నించారు. కేంద్ర నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు మారుతోందని... రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, ఇప్పుడు జేపీ నడ్డా వచ్చారని జోషి విశ్లేషించారు.

నేనేం పాకులాడలేదు: నిరాణి
సీఎం పదవికోసం తాను పాకులాడలేదని రాష్ట్ర మంత్రి మురుగేశ్‌ నిరాణి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని మారుస్తారన్న విషయం తెలియదని, ఇప్పటికే తామంతా ఆయనకు మద్దతుగానే ఉన్నామని వివరించారు. సీఎం పదవి కోసం దిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. రెండు నెలలకోసారి ఆలయాలకు వెళ్తానని, వారణాసికి వెళ్లడంలో ప్రత్యేకత లేదని కొట్టిపారేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని