కోదండరాం సత్యాగ్రహ దీక్ష

ప్రధానాంశాలు

కోదండరాం సత్యాగ్రహ దీక్ష

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం క్రూడ్‌ ఆయిల్‌ ధర 70 డాలర్లే ఉందని, అయినా పెట్రోల్‌ ధర లీటరుకు రూ.100 దాటిందని విమర్శించారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరల్లో 60 శాతం పన్నులే ఉన్నాయన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ తెజస రాష్ట్ర కార్యాలయంలో కోదండరాం గురువారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలతో ఉపాధి అవకాశాలపై దుష్ప్రభావం పడుతోందన్నారు. 2018-19 నుంచి ఆర్థిక వృద్ధి మందగించిందన్నారు. పన్నులు ఉపసంహరిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌లను లీటరు రూ.50లకు, వంటగ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కు ఇవ్వొచ్చని చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులపై ఒకే పన్ను విధానం అమలు చేయాలని, ధరలు తగ్గించకుంటే పాలన నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. దీక్షకు పలు ప్రజాసంఘాలు, ఆటో, లారీ యూనియన్ల నేతలు మద్దతు తెలిపారు. సాయంత్రం కోదండరాంతో ప్రజాసంఘాల నాయకులు దీక్షను విరమింపజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని