27న భారత్‌బంద్‌కు మద్దతు: ప్రతిపక్షాల వెల్లడి

ప్రధానాంశాలు

27న భారత్‌బంద్‌కు మద్దతు: ప్రతిపక్షాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. రైతు సంఘాలు ఈనెల 27న తలపెట్టిన భారత్‌బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మల్లు రవి (కాంగ్రెస్‌), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), కోదండరాం (తెజస), బక్క నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి (తెదేపా), వేముల వెంకట్రామయ్య (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ) తదితర నేతలు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ వనరులను కార్పొరేట్‌ సంస్థలకు చౌకగా అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానాల వల్ల పెట్రో ఉత్పత్తుల ధరలు అమాంతంగా పెరిగాయన్నారు. దేశ భవిష్యత్‌ కోసం జరుగుతున్న భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ధరణిలో అక్రమాలు జరుగుతున్నాయనీ, సకలజనుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. పోడు రైతులకు సాగు పట్టాలను అందజేయాలని డిమాండ్‌చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని