బీఏసీ సమావేశానికి భాజపాను ఎందుకు ఆహ్వానించరు?

ప్రధానాంశాలు

బీఏసీ సమావేశానికి భాజపాను ఎందుకు ఆహ్వానించరు?

ఎమ్మెల్యే రఘునందన్‌రావు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఏసీ సమావేశానికి భాజపాను ఎందుకు ఆహ్వానించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో ఇద్దరు-ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఏసీ సమావేశానికి ఆహ్వానించారని, తెలంగాణలో మాత్రం సభా సంప్రదాయాలను మంటగలుపుతున్నారని విమర్శించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేస్తామని వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని