రేవంత్‌రెడ్డిపై మూడు కేసుల కొట్టివేత

ప్రధానాంశాలు

రేవంత్‌రెడ్డిపై మూడు కేసుల కొట్టివేత

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డిపై నమోదైన మూడు కేసులను నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టేసింది. 2018 ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ మహబూబాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 2015లో జైలు నుంచి విడుదలైన సందర్భంగా చేపట్టిన ర్యాలీ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని ఓయూ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో, ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ చిక్కడపల్లి స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అభియోగాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసులను న్యాయస్థానం కొట్టివేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని