పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు అర్థరహితం: డీజీపీ కార్యాలయం

ప్రధానాంశాలు

పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు అర్థరహితం: డీజీపీ కార్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌: డీజీపీ, మంత్రుల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వాటిలో నిజం లేదని డీజీపీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ టెలిఫోన్‌ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్‌కు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసిందని, నేరాల అదుపులో భాగంగా వీటిని అనుసరిస్తూ విధులు నిర్వర్తిస్తామని పేర్కొంది. పోలీసు శాఖలో గ్రూపిజం ఉందన్న ఆరోపణలు నిరాధారమని, అవసరాలు, ప్రతిభ ఆధారంగానే బదిలీలు జరుగుతుంటాయని స్పష్టం చేసింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని