కేసీఆర్‌ పాలనలో మోసపోని వర్గమే లేదు: షర్మిల

ప్రధానాంశాలు

కేసీఆర్‌ పాలనలో మోసపోని వర్గమే లేదు: షర్మిల

ఆరో రోజుకు చేరిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర

తుమ్మలూరులో పాఠశాల విద్యార్థులతో షర్మిల

కందుకూరు, మహేశ్వరం- న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేయని వర్గమే లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. 1200 మంది యువకుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని.. 8 వేల మంది రైతుల ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన ఘనత ఆయనదేనన్నారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆరోరోజు సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ప్రారంభమై కందుకూరు మండలంలోకి ప్రవేశించి.. రాచులూరు గేటు లేమూరు మీదుగా ఆగర్‌మియాగూడకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మహిళలు, వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. తుమ్మలూరులో పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. లేమూరులో ఏర్పాటు చేసిన ‘షర్మిలతో మాట ముచ్చట’లో పలు సమస్యలు ఆమె దృష్టికి వచ్చాయి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే.. విద్యామంత్రి హోదాలో ఉన్న సబితారెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేమూరు చౌరస్తా వద్ద షర్మిలను ఆమె తల్లి విజయమ్మ కలిశారు. ఆగర్‌మియాగూడలో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద షర్మిల బస చేశారు. మంగళవారం ఉదయం పాదయాత్ర తిమ్మాపూర్‌ చేరుకుంటుంది. ఇక్కడ ఆమె నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొంటారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని