ఇవేం తిట్లు.. ఇవేం ఎన్నికలు?: చాడ

ప్రధానాంశాలు

ఇవేం తిట్లు.. ఇవేం ఎన్నికలు?: చాడ

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ‘ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలి.. పారదర్శకత రావాలి. చట్టాలు నిక్కచ్చిగా అమలయ్యేలా రూపొందించాలి..’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వనరులను దోచుకుంటున్నాయని, అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మంగళవారం సిద్దిపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, నేతలు బూతులు తిట్టుకోవడం శోచనీయమన్నారు. ఆ స్థాయిలో తిట్ల పురాణం మునుపెన్నడూ చూడలేదని వాపోయారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం, వివిధ తాయిలాలతో పాటు ఆ జాబితాలో కొత్తగా గంజాయిని చేర్చారన్నారు. వరి పంటకు ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా రైతుల మెడ చుట్టూ ఉరిబిగించే చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని