TS News: కడుపులో 3 కిలోల వెంట్రుకలు!

ప్రధానాంశాలు

TS News: కడుపులో 3 కిలోల వెంట్రుకలు!

శస్త్రచికిత్స ద్వారా గడ్డ తొలగింపు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: కడుపునొప్పితో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి 3 కిలోల వెంట్రుకల గడ్డను బయటకు తీశారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం బూచన్‌పల్లికి చెందిన శ్రీలత(20) కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతోంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనపడలేదు. కుటుంబీకులు ఆమెను ఈనెల 17న సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్‌ కొత్తపల్లి కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ యాదగిరి పరీక్షలు చేసి శ్రీలత కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం శస్త్రచికిత్స చేసి వెంట్రుకలతో కూడిన మూడు కిలోల గడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం శ్రీలత క్షేమంగా ఉంది. ఆమెకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి మానసిక ఒత్తిడి, ఒంటరితనం   తదితర కారణాలతో కొందరిలో వెంట్రుకలు తినడం అలవాటుగా మారుతుందని డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. శ్రీలత మట్టి, సున్నం సైతం తినడం వల్ల కడుపులో వెంట్రుకలు గడ్డగా మారాయని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని