యుగయుగాల వేడుక..  తనివితీర చూడగ..

ప్రధానాంశాలు

యుగయుగాల వేడుక..  తనివితీర చూడగ..

కమనీయం..  సీతారాముల కల్యాణం
భద్రాచలంలో నేత్రపర్వంగా వేడుక
కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే క్రతువు

భద్రాచలం, న్యూస్‌టుడే: జగదభిరాముడు పెళ్లికొడుకయ్యారు. సీతమ్మతల్లి పెళ్లికూతురుగా ముస్తాబయ్యింది. వారిద్దరికీ వేద పండితులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం జరిపించారు. భద్రాచలంలో బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. నిత్య కల్యాణ మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో నిరాడంబరంగా ఈ వేడుక జరిపారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ప్రవేశం కల్పించలేదు. అర్చకులు, ఆలయ సిబ్బంది, కొద్దిమంది ప్రముఖుల సమక్షంలోనే క్రతువు నిర్వహించారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా విశ్వవ్యాప్తంగా భక్తులు వీక్షించారు. మధ్యాహ్నం 12.30కు అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాములవారి శిరస్సులపై ఉంచారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, అజయ్‌కుమార్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌లు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని