చిన్నారి వైద్యానికి కేటీఆర్‌ అండ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారి వైద్యానికి కేటీఆర్‌ అండ

విన్నవించిన వెంటనే స్పందించిన మంత్రి

రాయికోడ్‌, న్యూస్‌టుడే: వింత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి గురించి ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు విన్నవించగా, వైద్య సాయం అందించేందుకు ఆయన బాధ్యత తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సింగీతం గ్రామానికి చెందిన సుమలత, అవినాష్‌ల రెండో సంతానం అక్షయ(2)కు గత ఏడాదిగా మెడ చుట్టూ వాపు పెరుగుతోంది. చికిత్స నిమిత్తం రూ.లక్ష ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. చిన్నారి తల్లిదండ్రులు మూడు రోజుల కిందట సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా ‘సిస్టిక్‌ హైబ్రోమా’ అనే వ్యాధి సోకిందని శస్త్రచికిత్సకు రూ.3 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ చిన్నారి వ్యాధి విషయాన్ని గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన కేటీఆర్‌.. చిన్నారికి శస్త్రచికిత్స చేయించడంతో పాటు పూర్తిగా నయమయ్యే వరకు సహకారం అందిస్తానని రీట్వీట్‌ చేశారు. వెనువెంటనే ఈ నెల 11న సిటిజెన్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాలని మంత్రి కార్యాలయం నుంచి తండ్రి అవినాష్‌ మొబైల్‌కు సందేశం అందింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని