TS News: త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలు
close

ప్రధానాంశాలు

TS News: త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలు

హోంమంత్రి మహమూద్‌ అలీ

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.కోటితో నిర్మించిన పట్టణ ఠాణా నూతన భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహిళలకు పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని చెప్పారు. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం స్పీకర్‌ వి.భూపాల్‌రెడ్డి, ఐజీలు స్టీఫెన్‌ రవీంద్ర, శివశంకర్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని