KTR తనయుడు హిమాన్ష్‌కు డయానా అవార్డు

ప్రధానాంశాలు

KTR తనయుడు హిమాన్ష్‌కు డయానా అవార్డు

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్ష్‌రావు(15)కు 2021 సంవత్సరానికిగాను అంతర్జాతీయ పురస్కారం దక్కింది. బ్రిటన్‌లోని ‘తెస్సి ఒజో సీబీఈ’ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్‌ రాజకుమారి డయానా పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలందించే 9-25 ఏళ్లలోపు వారికి ఇస్తోంది. దీన్ని దక్కించుకున్న హిమాన్ష్‌.. సోమవారం దృశ్యమాధ్యమంలో స్వీకరించారు. హిమాన్ష్‌ ‘శోమ’ అనే పేరుతో గజ్వేల్‌ నియోజకవర్గంలోని గంగాపూర్‌, యూసుఫ్‌ఖాన్‌పల్లి గ్రామాల స్వయం సమృద్ధికి పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా హిమాన్ష్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ పురస్కారం దక్కించుకున్న హిమాన్ష్‌ తండ్రిగా గర్విస్తున్నానన్నారు. తాత కేసీఆర్‌ మార్గదర్శనంలో సేవలందిస్తూ పురస్కారం పొందానని హిమాన్ష్‌ తెలిపారు. ప్రాజెక్టుకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని