పీపీపీ విధానంలో చేపల విక్రయాలు

ప్రధానాంశాలు

పీపీపీ విధానంలో చేపల విక్రయాలు

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేపల మార్కెటింగ్‌, ఎగుమతుల ప్రక్రియను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘‘మత్స్యకారులకు ఆర్ధికంగా లబ్ధి చేకూర్చేందుకు మత్స్యసమాఖ్య ఆధ్వర్యంలో మత్స్యకార సంఘాల నుంచి చేపలు కొనుగోలు చేసి తెలంగాణ చేపలు పేరుతో మార్కెటింగ్‌ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌లో ప్రధానశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేస్తాం. వీటిలో చేపలను గ్రేడింగ్‌, శుద్ధి, ప్యాక్‌ చేసి మార్కెట్లకు, ఇతర రాష్ట్రాలకు పంపుతారు. పీపీపీ విధానంలో మరిన్ని విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాం.’’ అని మంత్రి వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని