ఆనందోత్సాహాల నడుమ బక్రీద్‌
close

ప్రధానాంశాలు

ఆనందోత్సాహాల నడుమ బక్రీద్‌

గవర్నర్‌, ముఖ్యమంత్రి శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ముసురు పట్టిన వాతావరణం నేపథ్యంలోనూ రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్‌ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. హైదరాబాద్‌లోని మీరాలం ఈద్గా, మాసాబ్‌ట్యాంకులోని హాకీ గ్రౌండ్‌, మెహిదీపట్నంలోని మిలిటరీ గ్రౌండ్‌, గోల్కొండకు చేరువలోని సెవెన్‌ టూమ్స్‌ వద్ద వేలాదిగా ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. చిన్నాపెద్దా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హోం మంత్రి మహమూద్‌ అలీ అజంపురా సమీపంలోని మసీదు వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తదితర నేతలు ముస్లింలకు శుభకామనలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని