వైద్యఆరోగ్యశాఖలో త్వరితగతిన ఖాళీల భర్తీ

ప్రధానాంశాలు

వైద్యఆరోగ్యశాఖలో త్వరితగతిన ఖాళీల భర్తీ

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యఆరోగ్యశాఖలోని ఖాళీలను త్వరితగతిన భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. కరోనా, ఇతర వ్యాధుల నివారణ, చికిత్స కోసం రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ సౌకర్యాల కల్పనతో పాటు బయోమెడికల్‌ టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయన శనివారం బీఆర్‌కే భవన్‌లో వైద్యఆరోగ్య మౌలిక సదుపాయాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లోని అన్ని పడకలకు ఆక్సిజన్‌ వసతి, ఐసీయూ పడకలను పెంచడం, ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం, జిల్లా ఆసుపత్రుల బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు చర్యలు వేగవంతం చేస్తామన్నారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు జయేశ్‌రంజన్‌, వి.శేషాద్రి, రిజ్వీ, రొనాల్డ్‌రోస్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని