మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాలకు జాతీయ వైద్య కమిషన్‌ శాశ్వత గుర్తింపు

ప్రధానాంశాలు

మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాలకు జాతీయ వైద్య కమిషన్‌ శాశ్వత గుర్తింపు

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్యకళాశాల ఎంబీబీఎస్‌ కోర్సుకు జాతీయ మెడికల్‌ కమిషన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు శాశ్వత గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు ఆ కళాశాల సంచాలకులు డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌కు లేఖ రాసింది. మహబూబ్‌నగర్‌లో 150 సీట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి బోధన జరుగుతోంది. అప్పట్లో కళాశాలలో చేరిన విద్యార్థులు 2021-22 ఏడాదికి కోర్సు పూర్తిచేయనున్నారు. జాతీయ వైద్యకమిషన్‌ నిబంధనల ప్రకారం ఏటా నిపుణుల కమిటీ కళాశాలలో సదుపాయాలు పరిశీలించి అనుమతి పునరుద్ధరిస్తుంది. ఈ ఏడాది కమిషన్‌ శాశ్వత గుర్తింపు రావాల్సి ఉండగా కరోనా కారణంగా తనిఖీ అవకాశం లేకుండా పోయింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పరిస్థితిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో 2021-22 విద్యాసంవత్సరానికి శాశ్వత గుర్తింపు వచ్చిందని కళాశాల సంచాలకులు తెలిపారు. దీంతో 2021-22లో కళాశాలలో డిగ్రీ పూర్తిచేయనున్న 150 మంది వైద్య విద్యార్థులకు కాళోజీ వర్సిటీ ఇచ్చే డిగ్రీకి గుర్తింపు వచ్చినట్లయింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని