తగ్గుముఖం పట్టిన వానలు

ప్రధానాంశాలు

తగ్గుముఖం పట్టిన వానలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బంగాళాఖాతంలో 3 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం శనివారం బలహీనపడింది. ఈ నెల 28న మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. శనివారం పగలు పెద్దగా వర్షాలు పడలేదు. ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని నాగరత్న చెప్పారు. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా మోస్రా (నిజామాబాద్‌)లో 9.3, పెద్దమంతల్‌ (వికారాబాద్‌)లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని