డ్రోన్ల విషయంలో జాగ్రత్త

ప్రధానాంశాలు

డ్రోన్ల విషయంలో జాగ్రత్త

నిసా డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: డ్రోన్ల వల్ల పెరిగిపోతున్న ముప్పును గుర్తించి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ(నిసా) సంచాలకుడు(డైరెక్టర్‌) సీవీ ఆనంద్‌ హెచ్చరించారు. ఇటీవల దేశ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా వెలుగుచూస్తున్న డ్రోన్‌ ఉదంతాలను ఉటంకిస్తూ ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌)లో ‘డ్రోన్ల వినియోగం-డ్రోన్ల నిరోధక పరిజ్ఞానం’ అంశంపై సోమవారం హకీంపేట్‌లోని నిసా ప్రాంగణంలో నిర్వహించిన సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ‘‘దేశంలోని అత్యంత కీలకమైన అణువిద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమలు, విమానాశ్రయాల వంటి వాటికి సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పిస్తోంది. ఆధునిక యుగంలో డ్రోన్లు భద్రతా బలగాల శక్తి సామర్థ్యాలను పెంచుతాయనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి వీటి సేవలు ఉపయోగపడతాయి’’ అని ఆనంద్‌ పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని