అక్టోబరు 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

ప్రధానాంశాలు

అక్టోబరు 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను అక్టోబరు 3వ తేదీ(ఆదివారం) జరపనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం రాత్రి ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. తొలుత జులై 3న ఆ పరీక్ష జరగాల్సి ఉండగా.. జేఈఈ మెయిన్‌ మూడు, నాలుగో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ మూడో విడత మంగళవారంతో.. నాలుగో విడత పరీక్షలు ఆగస్టు 26న మొదలై సెప్టెంబరు 2న ముగుస్తాయి. ఈ క్రమంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై విద్యార్థులు ఎదురుచూస్తుండగా ఆ తేదీని కేంద్ర మంత్రి ప్రకటించారు. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపిన రెండున్నర లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని