ఓటుకు నోటు కేసులో వాంగ్మూలాల నమోదు

ప్రధానాంశాలు

ఓటుకు నోటు కేసులో వాంగ్మూలాల నమోదు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు సాక్షుల వాంగ్మూలాల నమోదు వేగంగా సాగుతోంది. రెండో విడత షెడ్యూల్‌ సోమవారం ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షులు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సోదరుడు ఎ.కృష్ణారెడ్డి సాక్షిగా; సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ నిందితులుగా హాజరయ్యారు. కేసు నమోదు సమయంలో రేవంత్‌రెడ్డి ఉపయోగించిన సిమ్‌కార్డు కృష్ణారెడ్డి పేరిట ఉందని అనిశా పేర్కొంది. స్టీఫెన్‌సన్‌ డ్రైవర్‌ ఎ.శంకర్‌, స్నేహితుడు ఎస్‌.ఆంటోనీ వాంగ్మూలాల నమోదు పూర్తిచేశారు. కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని