మత్తడి దుంకుతున్న 12 వేల చెరువులు

ప్రధానాంశాలు

మత్తడి దుంకుతున్న 12 వేల చెరువులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 12,602 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుల్లో గణనీయంగా నీటి మట్టం పెరిగింది. 0-25 శాతం మధ్యన 7211 చెరువుల్లో నీటి మట్టం ఉండగా 25-50 శాతం మధ్య 6862 చెరువులు, 50-75 శాతం మధ్యన 6345 చెరువుల్లో నీరు చేరింది. 75-100 శాతం నీటి మట్టానికి 10,850 చెరువులు చేరుకున్నట్లు నీటిపారుదల శాఖ సోమవారం పేర్కొంది. ఈ వారంలో కురిసిన వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్‌, వరంగల్‌, మెదక్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో చెరువులకు జల కళ వచ్చింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని