దేశంలో అప్రకటిత ఆత్యయిక స్థితి

ప్రధానాంశాలు

దేశంలో అప్రకటిత ఆత్యయిక స్థితి

ప్రముఖ జర్నలిస్టు సీమా చిస్తీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దేశంలో పెగాసస్‌ స్పైవేర్‌ దుర్వినియోగమవుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సతీమణి, ప్రముఖ జర్నలిస్టు సీమా చిస్తీ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేందుకు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఆత్యయిక స్థితి నడుస్తోందన్నారు. బుధవారం ఆన్‌లైన్‌లో మంథన్‌ నిర్వహించిన చర్చలో ఆమె మాట్లాడారు. 2019లోనే ఇద్దరు అస్సాం ప్రజాప్రతినిధులపై, సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలు చేసిన జూనియర్‌ స్టాఫర్‌ కుటుంబంపై, కేంద్ర నిఘా సంస్థల ఉన్నతాధికారులపై పెగాసస్‌ నిఘా పెట్టారని ఆరోపించారు. మరో జాతీయ జర్నలిస్టు ప్రసన్న మాట్లాడుతూ.. 2019లోనే దేశంలో 121 మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాల్ని స్పైవేర్‌ ద్వారా తస్కరించినట్లు వాట్సప్‌ నిర్ధారించిందని.. అయినా కేంద్రం చర్యలు తీసుకోలేదన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని