పత్తికి రికార్డు ధర

ప్రధానాంశాలు

పత్తికి రికార్డు ధర

వరంగల్‌ మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తికి రికార్డు స్థాయి ధర లభించింది. క్వింటాలుకు రూ.8,060 ధర పలికింది. గతకొన్ని రోజులుగా క్వింటాలు తెల్ల బంగారానికి రూ.7,600 నుంచి 7,700 వరకు ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన రైతు గుండెకారి రంగారావు గురువారం మార్కెట్‌కు 17 బస్తాల పత్తి తీసుకొచ్చారు. ఓ ప్రైవేటు వ్యాపారి క్వింటాలుకు రూ.8,060 చెల్లించి పత్తిని కొనుగోలు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని