ఏపీపీ పోస్టులకు ఆగస్టు 8 నుంచి దరఖాస్తులు

ప్రధానాంశాలు

ఏపీపీ పోస్టులకు ఆగస్టు 8 నుంచి దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టులకు ఆగస్టు 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 151 మంది ఏపీపీల నియామకాలకు ఈ నెల 4న ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి అదే నెల 29 వరకు దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఒక అభ్యర్థి ఒకసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలను www.tslprb.in వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని