20 గుంటల్లోపు వ్యవసాయ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేత

ప్రధానాంశాలు

20 గుంటల్లోపు వ్యవసాయ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2000 చదరపు మీటర్లు లేదా 20 గుంటల్లోపు ఉండే వ్యవసాయ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయవద్దని సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి ఆయన సూచించారు. అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్‌లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసిన నేపథ్యంలో కొందరు వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి వ్యవసాయ లేఅవుట్ల (ఫాం లేఅవుట్ల) పేరుతో 2-3 గుంటల స్థలాలను విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీటి రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని