జైళ్లలో మళ్లీ ములాఖత్‌లు!

ప్రధానాంశాలు

జైళ్లలో మళ్లీ ములాఖత్‌లు!

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో ఏడాదిన్నరగా నిలిపేసిన ములాఖత్‌ల పునరుద్ధరణ దిశగా కార్యాచరణ మొదలైంది. ఆగస్టు మొదటి వారంలో దీనిపై ఉన్నతాధికారుల కీలక భేటీ జరగనుంది. కరోనా మరోసారి తీవ్రస్థాయిలో విజృంభించకపోతే ఆగస్టు రెండు లేదా మూడో వారం నుంచి ములాఖత్‌లకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. వ్యాక్సినేషన్‌ రెండు డోసులు పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం చూపిన ఖైదీల కుటుంబసభ్యులను అనుమతించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ‘ములాఖత్‌ల పునరుద్ధరణ కోసం ఖైదీల కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఆగస్టు మొదటి వారంలో భేటీ అనంతరం నిర్ణయం తీసుకుంటాం’ అని జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌ త్రివేది తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని