పీఆర్‌సీ అమలుపై విద్యాశాఖ ప్రతిపాదనలు

ప్రధానాంశాలు

పీఆర్‌సీ అమలుపై విద్యాశాఖ ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: సమగ్ర శిక్ష అభియాన్‌ పరిధిలోని కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌(యూఆర్‌ఎస్‌)తోపాటు ఎస్‌ఎస్‌ఏ కార్యాలయాల్లో పనిచేసే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులందరికీ 30 శాతం వేతనాల పెంపు వర్తింపజేయడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. పీఆర్‌సీ అమలుపై పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఇటీవల చర్చించారు. ఈ క్రమంలో విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. గిరిజన సంక్షేమశాఖ మినహా అన్ని శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల విద్యాసంస్థల సిబ్బందికి సంబంధించిన కొత్త పీఆర్‌సీ దస్త్రాలు ఆర్థికశాఖకు చేరాయని యూటీఎఫ్‌ నేతలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని