ఆగస్టులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

ప్రధానాంశాలు

ఆగస్టులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగస్టు 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రముఖ ఆలయాల సందర్శనతో పాటు పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొంటారని భాజపా వర్గాల సమాచారం. ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలు పూర్తయ్యాక దిల్లీ నుంచి బయల్దేరి రాత్రి తిరుపతికి చేరుకుంటారు. 16న ఉదయం తిరుమలలో దర్శనం అనంతరం భాజపా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడకు చేరుకుని, పార్టీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మంలో పార్టీ సమావేశంలో పాల్గొంటారు. 17న ఉదయం ఖమ్మం నుంచి బయల్దేరి ములుగు జిల్లా పాలంపేటకు వెళ్తారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని