హరితహారం ఉద్రిక్తం

ప్రధానాంశాలు

హరితహారం ఉద్రిక్తం

ములకలపల్లి, న్యూస్‌టుడే: అటవీ శాఖ అధికారులు చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కంపార్టుమెంట్‌ నెం.277, 288లోని 53 హెక్టార్లలో ఈ నెల 14న ముందస్తు హరితహారం పనులు చేపట్టారు. ఈ సమయంలో పోడుదారులు పనులను అడుకున్నారు. ఈ ఘటనలో మాదారం ఉపసర్పంచి చంద్రశేఖర్‌ సహా 18 మందిపై కేసులు నమోదయ్యాయి. గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పోడుసాగుదారులు అడ్డుకుంటారన్న సమాచారంతో సీపీఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, ఉప సర్పంచి చంద్రశేఖర్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు గ్రామాల పోడుదారులు సీపీఎం ఆధ్వర్యంలో సంఘటనాస్థలికి చేరుకుని మొక్కలను పీకేశారు. ఈ క్రమంలో పోలీసులు, సాగుదారులకు మధ్య జరిగిన తోపులాటలో మాదారం గ్రామానికి చెందిన సంఘం రాములమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. అటవీ సిబ్బంది ఆమెకు సపర్యలు చేసి, మంగపేట పీహెచ్‌సీకి తరలించారు. సీపీఎం నాయకుడు గౌరి నాగేశ్వరరావుతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ములకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఎఫ్‌బీవో కృష్ణ ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని