విద్యుత్‌ బిల్లుపై ఉమ్మడి పోరు

ప్రధానాంశాలు

విద్యుత్‌ బిల్లుపై ఉమ్మడి పోరు

పార్లమెంటులో ప్రవేశపెడితే సమ్మె

ఉద్యోగ, కార్మిక సంఘాల నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ సవరణ బిల్లు-2021పై రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ సంఘాల ఉద్యోగులు, నేతలు కలిసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే దేశవ్యాప్త సమ్మెకైనా వెనకాడబోమని 19 సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందితే విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రైవేట్‌పరం అవుతాయని, రైతులకు ఉచిత విద్యుత్‌ ప్రశ్నార్థకం అవుతుందని, క్రాస్‌ సబ్సిడీ విధానం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌లో గురువారం జాతీయ విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ రత్నాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు రూ.37 వేల కోట్లతో విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి చేశామన్నారు. బిల్లు ఆమోదం పొందితే తమపై ప్రైవేటు వారు అజమాయిషీ చేస్తారని తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆగస్టు 3 నుంచి నాలుగు రోజుల పాటు దిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సత్యాగ్రహ దీక్షలు చేపడతారని, ఆగస్టు 10న దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు విధులను బహిష్కరిస్తారని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని