1,2 తరగతులకూ టీవీ పాఠాలు

ప్రధానాంశాలు

1,2 తరగతులకూ టీవీ పాఠాలు

3వ తేదీ నుంచి ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఈ నెల 3వ తేదీ నుంచి టీవీ పాఠాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శనివారం రాత్రి పాఠాలు ప్రసారమయ్యే కాలపట్టికను వెల్లడించింది. గత ఏడాది 3 నుంచి 10వ తరగతుల వరకే టీవీల ద్వారా పాఠాలు అందించగా.. ఈ సారి ఆ తరగతులతోపాటు ఒకటి రెండు తరగతులకు కూడా విస్తరించారు. టీశాట్‌ నిపుణ ఛానెల్‌లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో రోజుకు గంట పాటు పాఠాలు ప్రసారమవుతాయి. ఆంగ్లం, గణితం, మాతృ భాష సబ్జెక్టులు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు 4 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా. గత నెల రోజులుగా 3-10 తరగతులను నాలుగు స్థాయిలుగా విభజించి బ్రిడ్జి కోర్సు పేరిట కింది తరగతుల పాఠాల్లోని ముఖ్యాంశాలను ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని