‘తేనెటీగల అభివృద్ధి కేంద్రం’ ఏర్పాటుకు ప్రతిపాదనలు

ప్రధానాంశాలు

‘తేనెటీగల అభివృద్ధి కేంద్రం’ ఏర్పాటుకు ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సమగ్ర తేనెటీగల పెంపకం అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉద్యాన శాఖను రాష్ట్ర తేనెటీగల పెంపకం పథకం పర్యవేక్షణ కమిటీ ఆదేశించింది. ఈ కమిటీ తొలి సమావేశం శనివారం రాష్ట్ర ఉద్యాన సంస్థ కార్యాలయంలో జరిగింది. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇప్పించాలని, వాటి పెంపకానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలకు కమిటీ సూచించింది. ఈ సమావేశంలో ఉద్యానశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి రఘునందన్‌రావు, సంచాలకుడు వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని