అమెరికా ఫెలోషిప్‌నకు ముగ్గురు గురుకుల విద్యార్థినులు

ప్రధానాంశాలు

అమెరికా ఫెలోషిప్‌నకు ముగ్గురు గురుకుల విద్యార్థినులు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కమ్యూనిటీ కాలేజ్‌ ఇనిషియేట్‌ ప్రోగ్రాం (సీసీఐపీ) ఫెలోషిప్‌నకు ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు. పేద కుటుంబాలకు చెందిన శిరీష, బ్లోసమ్‌, ప్రీతిలు అమెరికా కాన్సులేట్‌ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో సత్తా చాటి ప్రవేశాలు పొందారు. వీరిని శనివారం గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ అభినందించి, ల్యాప్‌టాప్‌లు బహూకరించారు. ‘‘మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూస్తే ఎప్పుడూ విమానమెక్కి అమెరికా వెళ్తానని ఊహించలేదు. కానీ ఇప్పుడు న్యూయార్క్‌లోని జేమ్‌స్టౌన్‌ కమ్యూనిటీ కళాశాల నుంచి బాల్యవిద్య కోర్సుకు ఎంపికయ్యా’’ అని శిరీష తెలిపారు. వ్యవసాయ కార్మికురాలి కుమార్తె ప్రీతి ఒహియోలోని సింక్లెయిర్‌ కమ్యూనిటీ కళాశాలలో వ్యవసాయ విద్య కోర్సుకు ఎంపికయ్యారు. ఎల్‌బీనగర్‌ డిగ్రీ గురుకుల కళాశాలకు చెందిన బ్లోసమ్‌ తల్లిదండ్రులు నిరుపేద కూలీలు. ఈమె బాల్టిమోర్‌ కమ్యూనిటీ కళాశాలలో చేరనున్నట్లు రొనాల్డ్‌ రాస్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని