ఐసెట్‌ దరఖాస్తుల గడువు 5

ప్రధానాంశాలు

ఐసెట్‌ దరఖాస్తుల గడువు 5

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష (టీఎస్‌ఐసెట్‌-2021)కు దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఐసెట్‌-2021 కన్వీనర్‌, కేయూ వాణిజ్యశాస్త్రం ఆచార్యులు కె.రాజిరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 5వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలను ఐసెట్‌ -2021 వెబ్‌సైట్‌లో చూడవచ్చని రాజిరెడ్డి సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని