బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి రేణుక పదవీవిరమణ

ప్రధానాంశాలు

బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి రేణుక పదవీవిరమణ

ఈనాడు, హైదరాబాద్‌: గత 32 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిళ్ల కార్యదర్శిగా సేవలందించిన ఎన్‌.రేణుక శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. తెలంగాణ, ఏపీ బార్‌ కౌన్సిళ్ల ఛైర్మన్లు ఎ.నరసింహారెడ్డి, ఘంటా రామారావులతో పాటు మాజీ ఛైర్మన్‌ ఎం.రాజేందర్‌రెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, ప్రస్తుత బార్‌ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొని రేణుక సేవలను అభినందించారు. కాగా నూతన కార్యదర్శిగా వి.నాగలక్ష్మి నియమితులయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని