పొలంలో బయటపడ్డ భారీ గణపతి విగ్రహం

ప్రధానాంశాలు

పొలంలో బయటపడ్డ భారీ గణపతి విగ్రహం

నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: పొలం దున్నుతుండగా భారీ గణపతి విగ్రహంతో పాటు పీఠం బయటపడ్డాయి. ఈ సంఘటన శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్‌ గ్రామ శివారులో తనకున్న పొలంలో కొన్నేళ్లుగా వర్షాధార పంటలైన పత్తి, కంది, మినుము, పెసర వంటివి సాగుచేస్తున్నారు. ఈసారి వర్షాలు బాగా కురవడం, నీరు అందుబాటులో ఉండటంతో మాగాణి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అచ్చుకట్టలు కట్టేందుకు శనివారం సాయంత్రం పొలంలో దున్నిస్తుండగా ట్రాక్టరు నాగలికి తగిలి విగ్రహం, పీఠం బయటపడ్డాయి. ఈ విషయమై అధికారులకు ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని